ఒక సాదాసీదా లవ్ స్టోరీ సినిమాలో ప్రేక్షకులు ముందుకు వచ్చి సీతారామం సినిమా ఎంతలా సూపర్ హిట్ సాటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల కాలంలో ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని చూడలేదు అంటూ ప్రతి ఒక్కరు కూడా అతి సీతారామం లవ్ స్టోరీ మత్తులో మునిగి తేలారు అని చెప్పాలి.ఇక ఈ సినిమాలోని లవ్ స్టోరీని ఎంతగానో ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. ఈ సినిమా తర్వాత సీతారామంలో హీరోయిన్గా నటించిన మృనాల్ ఠాగూర్ కు ఒక్కసారిగా క్రేజ్ వచ్చి పడింది అన్న విషయం తెలిసిందే.


 అంతేకాదు సీతారామం సినిమా చూసిన తర్వాత మూడు నాలుగు ఠాగూర్ ఎంతో మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది అని చెప్పాలి. సీరియల్ నటిగా కెరియర్ ప్రారంభించి విట్టిదండు అనే మాట సినిమాతో హీరోయిన్గా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది మృణాల్ ఠాగూర్. ఇక తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇక తెలుగులో సీతారామం అనే సినిమాతో అడుగుపెట్టగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ అమ్మడి దగ్గరికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి అని చెప్పాలి.


 ఒకవైపు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇక సినిమాల ఎంపికలో కూడా తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుంటుందట. ఈ క్రమంలోనే ఇక నాని తర్వాత సినిమాలో మృనాల్ ఠాగూర్ అవకాశాన్ని దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మృనాల్ ఠాగూర్ రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సీతారామం సినిమాకు 80 లక్షల పారితోషకం తీసుకున్న మృనాల్ ఠాగూర్ నాని సినిమాకు మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట.  అయితే ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ దృశ్య నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: