
తునివు : కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 11 వ తేదీన తమిళ్ ... తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించాడు.
వారిసు : తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. తెలుగులో ఈ మూవీ ని వారసుడు టైటిల్ తో విడుదల చేయనున్నారు.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రి సంస్థ ఈ మూవీ ని నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
వాల్తేరు వీరయ్య : చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూ వీని జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.
కళ్యాణం కమనీయం : సంతోష్ శోభన్ హీరోగా ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గ తెరకెక్కిన ఈ మూవీ ని అనిల్ కుమార్ అల్లా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.