స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. అయితే రాక్స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డి.ఎస్.పి మంచి హిట్ ఆల్బమ్ చేయక చాలా రోజులు అయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు దేవి శ్రీ ప్రసాద్. మంచి సాంగ్స్ ఆయన ఇచ్చినప్పటికీ కొంత ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇందులో భాగంగానే ముఖ్యంగా 250 రూపాయల బూర తో వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక పాటను కంపోజ్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. 

ఇక ఆ పాట గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ఇందులో భాగంగానే ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ  సినిమా నుండి ఇప్పటికే దాదాపు అన్ని పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమాలో ముఖ్యంగా బాస్ పార్టీ పాట ఎంతటి క్రేజ్ ని సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలోని అన్ని పాటలు బాగున్నప్పటికీ ఒక పాటపై ఇప్పటికి ట్రోల్స్ ఆగడం లేదు. అయితే పూనకాలు లోడింగ్ పాట ఈ సినిమాలో చాలా హైలెట్ అవుతుందని.. ఇదివరకే చాలాసార్లు చిత్ర బృందం చెప్పడం జరిగింది.

కానీ ఈ పాట వచ్చి ఎన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ పాట పైన నెగటివ్ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ఈ పాట విన్నానంతరం చాలామంది ఆ బూర సౌండ్ ఈ పాటలో అస్సలు బాలేదు అంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ ఈ పాటకు వాడిన బూర గురించి కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అయితే దేవిశ్రీప్రసాద్ ఆ బూరని కేవలం 250 రూపాయలకు తీసుకున్నడని.. ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయాలి అన్న ఆలోచనతో ఈ బూరని ఈ పాట కోసం ఉపయోగించాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆ  బూరకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ ని చూసిన చాలామంది ఈ బూరా జాతరలో 25 రూపాయలకే దొరుకుతుంది అంటూ చాలా దారుణంగా కామెంట్లను చేశారు. ఇక ఈ సినిమాకి గాను దేవిశ్రీప్రసాద్ ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: