కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. విజయ్ కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించడం ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ ని సృష్టించుకున్న ఈ హీరో తాజాగా వారిసు అనే తమిళ మూవీ లో హీరోగా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం తమిళ్ మరియు తెలుగు భాషలలో జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా తమిళ వర్షన్ ను జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... తెలుగు వర్షన్ ను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ మూవీ 2 గంటల 50 నిమిషాల 30 సెకండ్ ల భారీ రన్ టైమ్  తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: