
ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతంత మాత్రమే అలరిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరుణంలో ఈ చిత్రానికి సంబంధించి ఓటిటి వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అహ ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ రైట్స్ మంచి ఫ్యామిలీ సినిమాలను ఆహా ఎక్కువగా సొంతం చేసుకుంటున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యూత్ ను బాగా ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోష్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోలేకపోయినా ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా సక్సెస్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రం కంటెంట్ కారణంగా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది. అయితే తక్కువ బడ్జెట్ సినిమా కావడం చేత ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ లోకి ప్రవేశించి మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణం కమనీయం సినిమా విడుదలైన అన్ని సినిమాలకు పోటీగా వచ్చి అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెంట్ లోకి అడుగుపెట్టడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అందుకొని ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి మరి. సంతోష్ శోభన్ ఎప్పుడూ కూడా సరికొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి తన తదుపరి చిత్రం తోనైనా మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.