ఇటీవల కాలంలో సినిమా నటులు అందరూ కూడా రెండు చేతులారా సంపాదిస్తున్నారు అని చెప్పాలి. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు చేస్తున్న వాణిజ్య ప్రకటనలు మాత్రం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అలాంటి యాడ్స్ లో మీరు నటించడం ఏంటి అంటూ ఏకంగా అభిమానులందరూ హీరోల ముఖం పైన విమర్శలు చేస్తూ ఉండడం కూడా కనిపిస్తుంది.


 గతంలో విమల్ అనే వాణిజ్య ప్రకటనలో నటించినందుకుగాను కొంతమంది స్టార్ హీరోలు ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇటీవల అమితాబచ్చన్ సైతం ఒక బిస్కెట్ ప్రకటనలో నటిస్తూ ఉండడం గమనార్హం. కాగా అమితాబచ్చన్ చేస్తున్న ఈ బిస్కెట్ ప్రకటనను చేయవద్దు అంటూ ఎన్ఏపిఐ అమితాబ్ కు లేఖ రాసింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై డాక్టర్ అరుణ్ మాట్లాడుతూ అమితాబచ్చన్ నటించిన బిస్కెట్ ప్రకటన నిజంగా మోసపూరితమైనది. ఆ బిస్కెట్లో చక్కెర కొవ్వు సోడియం అధికంగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య  సంస్థ ప్రమాణాలకు విరుద్ధంగా సదరు బిస్కెట్ తయారీ జరుగుతుంది.


 ఇక అలాంటి ప్రోడక్ట్ ను వాణిజ్య ప్రకటనల ద్వారా ప్రమోట్ చేయడానికి అమితాబ్ ఓకే చెప్పారు అన్న విషయం తెలిసి ఆశ్చర్య పోయాను. దయచేసి అలాంటి ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం ఆపేసేయండి. సదరు ఆహార పదార్థంలో కొవ్వు మొత్తం 10% కంటే ఎక్కువ అంటే అది హెచ్ఎఫ్ఎస్ఎస్ విభాగంలో చేరుస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్ లో నటించకండి ఆరోగ్యానికి కలిగించే ఆహార ఉత్పత్తుల ప్రకటనలో నటించడం సరైనదా ఒకసారి మీరే ఆలోచించండి అంటూ డాక్టర్ అరుణ్ ఇక అమితాబ్ కు రాసిన లేఖలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: