మహానటి సావిత్రి బయోపిక్ లో నటించే సమయంలో కీర్తి సురేష్ సావిత్రి నటించిన అనేక సినిమాలు చూడటమే కాకుండా తన రూమ్ లో అన్ని ఫోటోలను తీసివేసి సావిత్రి ఫోటోలతో నింపి తానే సావిత్రి అన్న భావన కలిగే విధంగా ప్రవర్తించానని కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంత కష్టపడి ఆమె నటించింది కాబట్టే ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు దక్కింది.


సావిత్రి మహానటి మాత్రమే కాకుండా చాల మంచి మనసున్న వ్యక్తి అని ఎందరికో వారి పేదరికాన్ని చూసి చలించిపోయి దానధర్మాలు చేసిందని ఆనాటి నటీనటులు చెపుతూ ఉంటారు. ఇప్పుడు ఆ లక్షణాన్ని ఆమె పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగిస్తోంది. ఆమె నాని తో కలిసి లేటెస్ట్ గా నటిస్తున్న ‘దసరా’ మూవీ షూటింగ్ ముగింపు రోజున ఆ యూనిట్ లో పనిచేసిన లైట్ బాయ్ నుండి సహాయ దర్శకుడు వరకు సుమారు 130 మందికి విలువైన గిఫ్ట్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దసరా యూనిట్ మెంబర్స్ అందరికీ 2 గ్రాములు బంగారు కాయిన్స్ ను ప్రతి ఒక్కరికీ ఆమె గిఫ్ట్ గా ఇచ్చింది. సాధారణంగా టాప్ హీరోలు ఇలా అప్పుడప్పుడు తాను నటించిన సినిమా షూటింగ్ ముగింపు రోజున గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ గిఫ్ట్స్ పుచ్చుకుంటారు కాని ఇచ్చిన సందర్భాలు చాల అరుదుగా ఉంటాయి. ఇప్పుడు ఆలిస్టులోకి కీర్తి సురేష్ చేరింది.‘మహానటి’ మూవీ తరువాత సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కీర్తి కెరియర్ లో ఒక్క హిట్ లేదు. ఈమధ్య యంగ్ హీరోయిన్స్ తో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో ఇక లాభంలేదు అనుకుని ఆమె కూడ గ్లామర్ షోకు ఓకె చెపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘భోళాశంకర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్ ఒకప్పుడు మహానటి సావిత్రి ఎన్టీఆర్ కు చెల్లెలుగా నటించిన సాహసాన్ని రిపీట్ చేస్తూ డిఫరెంట్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: