ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న.ఇక నారా లోకేష్ యాత్రలో టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న సృృహ తప్పిపడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ప్రైవెట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు తీవ్రంగా గుండెపోటు వచ్చిందని..అలాగే ఆయన కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనకు మంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు. అయితే ఎయిర్‌ లిఫ్ట్ చేయాలా..లేక రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదని చెప్పారు బాలకృష్ణ. తారకరత్న మెల్లగా కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు బాల కృష్ణ. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు బాల కృష్ణ. ఇంకా అలాగే మరోవైపు.. చంద్రబాబు నాయుడు గారు వైద్యులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో బాల కృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేయడం జరిగింది.


తన అన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో తెలుసుకోవడానికి బాలకృష్ణకు ఫోన్ చేశారు ఎన్టీఆర్.ఆయన హెల్త్ కండీషన్ గురించి ఇంకా ఆసుపత్రికి తరలించడం పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆయన ఎలాగైనా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు తారకరత్న.ఈ రోజు ఉదయం పాటు జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా ఆయన లోకేష్‌ వెంటే ఉన్నారు. కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు కూడా చేశారు. ఇక ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తోసుకుని రావడంతో ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు తారకరత్న. ఇక వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ఆయనకి ప్రథమ చికిత్స అందించారు.తారకరత్నకు ఏమి కాకూడదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.అనేక ప్రార్ధనలు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: