టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున గత సంవత్సరం ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్ ప్లాప్ ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న నాగార్జున కు చివరికి తీవ్ర నిరాశ మిగిలింది.ఇక నాగార్జున ఈ మధ్య కాలం లో ఏ సినిమా చేసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అది సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదు. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి మంచి కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.రచయితగా ఈ మధ్య కాలం లో బాగా ఫేమస్ అయ్యాడు బెజవాడ ప్రసన్న కుమార్. ఈయన ఇటీవల విడుదలైన ధమాకా సినిమా కి కథ, స్క్రీన్ ప్లే, ఇంకా డైలాగ్స్ ని అందించాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని రవితేజని 100 కోట్ల హీరోగా మార్చింది.ధమాకా విడుదల అయ్యి మంచి సూపర్ హిట్ దక్కించుకున్న వెంటనే నాగార్జున పిలిచి మరీ బెజవాడ ప్రసన్న కుమార్ కి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.


ఆ మధ్య ఈ సినిమా గురించి కొంచెం హడావిడి జరిగింది. కానీ ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ విషయంలో కొంచెం ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇదే సమయం లో నాగార్జున కు జోడి గా సీతారామం సినిమా లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన అందాల యువరాణి మృణాల్ ఠాగూర్ ని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. మృణాల్ సీతారామం సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాక నటనతో కూడా బాగా మెప్పించి వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇప్పుడు నాని కి జోడి గా ఒక సినిమాలో నటించేందుకు ఓ సినిమా కమిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ కూడా తాజాగా ప్రారంభం అయ్యింది. ఇప్పుడు ఇలా సీనియర్ హీరో నాగార్జునతో సినిమాని చేసేందుకు ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఓకే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: