
ప్రస్తుతం నాగార్జున ప్రసన్నకుమార్ అన్నరచయితకు డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చి అతడితో ఒక భారీ బడ్జెట్ సినిమా నాగ్ తన సొంత బ్యానర్ లో తీయిస్తున్నాడు. ప్రసన్నకుమార్ నక్కిన త్రినాధరావు దగ్గర అనేకసినిమాలకు రచయితగా పనిచేసాడు. ఈమధ్యనే విడుదలైన ‘ధమాక’ మూవీకి కథ అందించింది బెజవాడ ప్రసన్నకుమార్. ఒకవిధంగా చెప్పాలి అంటే ప్రసన్నకుమార్ కథల వల్లే నక్కిన త్రినాధరావు దర్శకుడుగా నిలబడగాలిగాడు అని కూడ అంటారు.
‘ధమాక’ మూవీ చూసిన తరువాత చిరంజీవికి నక్కిన త్రినాధరావుకు ఒక ఛాన్స్ ఇచ్చి మరో మాస్ మసాల చేయాలని ఒకనిర్ణయానికి రావడంతో త్రినాధరావ్ మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ కావడం అతడితో మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు చిరంజీవితో నక్కిన త్రినాధరావ్ తీయబోయే సినిమా కథకు సంబంధించి ఒక మంచిరచయిత సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్నఉద్దేశ్యం కలగడంతో త్రినాధ్ రావ్ ప్రస్తుతం నాగ్ కాంపౌండ్ లో ఉన్న బెజవాడ ప్రసన్నతో తాను చిరంజీవితో తీయబోతున్న సినిమాకు కథ విషయంలో సపోర్ట్ ఇమ్మని అడిగినట్లు గాసిప్పులు వస్తున్నాయి.
అయితే ఈవిషయమై నాగ్ బెజవాడ ప్రసన్నకు ఎంతవరకు సహకరిస్తాడు అంటూ మరికొన్ని గాసిప్పులు వస్తున్నాయి. దీనికికారణం గతంలో నాగార్జున దర్శకుడు మోహన్ రాజాతో ఒక సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్న పరిస్థితులలో మధ్యలో మోహన్ రాజాకు చిరంజీవి నుండి పిలుపు రావడంతో నాగ్ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టి చిరంజీవి వైపు వెళ్లిపోయి ‘గాడ్ ఫాదర్’ మూవీని తీసాడు. ఇప్పుడు నక్కిన త్రినాధ్ రావ్ చిరంజీవిల సినిమా కోసం ప్రసన్న కుమార్ నాగార్జున సినిమా కంటే చిరంజీవి సినిమా కథ పై ఎక్కువ దృష్టి పెడితే నాగ్ ఇరుకున పడతాడా అంటూ కొందరు సృష్టిస్తున్న గాసిప్పులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి..