
తాజాగా అవికా గోర్ హీరోయిన్ నుంచి సినిమా నిర్మాణరంగంలోకి కూడా అడుగు పెట్టిందని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. నిజానికి హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు.. అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి తరం హీరోయిన్ల వరకు చాలామంది నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కూడా చేరిపోయింది.. ఇకపోతే తాను నటించిన ఒక సినిమాను తానే స్వయంగా నిర్మించడం జరిగింది. ఈ విషయంపై అవికా గోరు స్పందిస్తూ.. జీవితంలో ఫలానా చేయాలని గోల్ మన మనసులో వచ్చిందంటే దాని అర్థం మనం చేయగలమని.. మనకు ఆ సామర్ధ్యం లేకపోతే మన మనసులోకి ఎటువంటి ఆలోచనలు రావు..
అయితే ఈ ఆలోచన అర్ధరాత్రి వచ్చింది కాదు.. 21 సంవత్సరాలు వయసు నుంచి నేను ప్రొడ్యూసర్ కావాలని అనుకున్నాను.. న్యూయార్క్ అకాడమీకి వెళ్లి చదువుకొని.. ఎడిటింగ్ కోర్సులు కూడా చేసి, డైరెక్షన్ కోర్సులు కూడా చేశాను దాని అర్థం నేను సినిమాలు ఎంతగానో ప్రేమిస్తున్నానని.. నటిగా మాత్రమే కొనసాగకుండా సినిమాలలో చాలా చేయాలని అనుకుంటున్నాను.. ప్రొడక్షన్ చేయడం కూడా అందులో భాగమే.. భవిష్యత్తులో నేను దర్శకత్వం కూడా చేస్తానేమో అంటూ తన మనసులో మాటను చెప్పు కొచ్చింది. ఇకపోతే పాప్ కార్న్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ప్రొడ్యూసర్ గా పరిచయం కాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తోంది.. ఇంకా విడుదల కాకముందే ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టింది ముద్దుగుమ్మ.