కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా , సంయుక్త మీనన్ ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల చేయనున్నారు. తమిళ్ లో ఈ మూవీ ని వేత్తి పేరుతో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ అనేక ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా ఈ మూవీ యూనిట్ ముగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యూఎస్ఏ హక్కులను కూడా భారీ ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క యూఎస్ఏ హక్కులను ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది. అలాగే ఈ సంస్థ ఈ సినిమాను యూఎస్ఏ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ధనుష్ "నేనే వస్తున్నా" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించ లేదు. మరి ఈ సార్ మూవీ తో ధనుష్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: