బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ గూర్చి మన తెలుగు ప్రేక్షకులకు  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో మూవీస్ లలో చేసి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న నటి.అలాగే తాను పీక్ స్టేజ్ లో ఉన్న కాలం లో ఐతే తన యొక్క అందం అభినయంతో ప్రేక్షకులని కట్టిపడేయడంతో పాటు స్టార్ హీరోయిన్గా ఒక రేంజ్ లో వెలుగు వెలిగింది. అలాగే మూడు దశాబ్దలుగా తన యొక్క నటనతో అందరిని అలరిస్తూ లక్షలాది మంది అభిమమానుల్ని మనసులలో స్థానం సంపాదించుకుంది. ఆమె బెఖుడి అనే మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఐతే ఆ తర్వాత తాను చేసిన బాజీగర్ మూవీ భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ దృష్టి కాజోల్ పై పడింది. ఆ తరువాత ఈమె బాలీవుడ్ స్టార్ హీరో ఐనా అజయ్ దేవగన్ తో ప్రేమలో పడిన కాజోల్ తనని పెళ్లి చేసుకుంది.ఐతే ఆమె పెళ్లి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రలో నటిస్తోంది  కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం కాజోల్ వయసు పెరిగే కొద్ది అందం మాత్రం రెట్టింపు అవుతోంది. ఆమె ప్రస్తుతం యాభై ఏళ్ల లో అడుగు పెడ్తున్న కూడా వన్నె తగ్గని అందాలతో మెరిసిపోతోంది. ఐతే ఆమె తల్లి చెప్పిన చిట్కాలను పాటిస్తూ తన అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఒకవైపు మూవీస్ లలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఐతే ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కాజోల్ అందంపై కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే  ఆమె యొక్క ఓల్డ్ అండ్ న్యూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్కిన్ వైటెనింగ్ సర్జరీ చేయించుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడంతో పాటు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. దానిపై స్పందించిన కాజోల్ ఆమె వైట్ అవ్వడం కోసం గతంలో తాను అలాంటి ఆపరేషన్స్ చేయించుకోలేదని మూవీ షూటింగ్స్ టైం లో ఒక్కోసారి ఎండలో షూటింగ్ కారణంగా కొంచం కలర్ తగ్గి ఉండొచ్చు అని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: