స్టార్ హీరోయిన్ నయనతార గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. అందరిలాగానే గ్లామర్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి. తెలుగు తమిళం అనే తేడా లేకుండా అందరి స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ మొదట్లో కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం అయింది.


 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కూడా కొనసాగుతోంది అని చెప్పాలి. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎన్నో ఏళ్లపాటు ప్రేమలో మునిగిన నయనతార పెళ్లితో తమ బంధానికి ప్రమోషన్ ఇచ్చేసింది. అంతేకాదు ఇక సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు కూడా తల్లి అయింది అన్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇకపోతే తన భర్త విగ్నేష్ ని అవమానించిన ఒక స్టార్ హీరో పై నయనతార పగ తీర్చుకుందట. నయనతార భర్త విగ్నేష్ టేకింగ్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అజిత్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే ఈ మూవీ కోసం విగ్నేష్ శివన్ దాదాపు సంవత్సరం నుంచి కూడా వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు అన్ని సిద్ధం చేసుకుని సినిమా మొదలెట్దాలీ అనుకున్న సమయంలో స్టోరీ నచ్చలేదు అంటూ హీరో అజిత్ షాక్ ఇచ్చాడు. దీంతో నయనతార భర్త ఎంతగానో ఫీల్ అయ్యాడట. నయనతార స్వయంగా చర్చలు జరిపి అజిత్ ను ఒప్పించే ప్రయత్నం చేసిన కుదరలేదు. దీంతో హర్ట్ అయిన నయనతార భర్తకు జరిగిన అవమానం నేపథ్యంలో  అజిత్ తో ఇక సినిమాలు చెయ్యొద్దని  పిక్స్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: