
1977 ఫిబ్రవరి 16వ తేదీన మహాశివరాత్రి రోజున కన్నడ నటుడు తూగుదీప శ్రీనివాస్ మరియు మీనా తూగుదీపా దంపతులకు దర్శన్ తూగుదీప జన్మించారు. మైసూర్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఈయన ఆ తర్వాత కాలంలో షిమోగాలోని థియేటర్ శిక్షణ సంస్థ అయిన నీనాసంలో నటన విద్యను పూర్తి చేయడం జరిగింది. 2003లో విజయలక్ష్మి వివాహం చేసుకున్న ఈయనకు వినీష్ అనే కుమారుడు కూడా జన్మించారు.. ఇకపోతే చిన్నవయసులోనే దర్శన్ తండ్రి గుండెపోటు వచ్చి చనిపోవడంతో తండ్రి ఆరోగ్య నిమిత్తం ఉన్న డబ్బు అంతా కోల్పోయారు. అంతగా చదువుకున్న దర్శన్ కూడా తన సొంత హోటల్లోనే పనిచేసి చివరికి ఆవు పాలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.
ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూ మరొకవైపు నటన అవకాశాల కోసం వెతుకులాడాడు.. అలా తన కెరీర్లో చాలామంది వ్యక్తుల చేత తిరస్కరించబడిన ఈయన ఆ తర్వాత సినిమా సేట్లలో ప్రొజెక్షనిస్టు , లైట్ బాయ్ గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత సినిమా ఆటోగ్రాఫర్ బీసీ గౌరీ శంకర్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశాడు. చివరిగా 1997లో మహాభారతం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.