
ఫిబ్రవరి 16వ తేదీన క్రిటిక్స్ కోసం ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ షో ప్రదర్శించబడుతుంది అని సమాచారం. తమిళ వర్షన్ కూడా రేపు చెన్నైలో జరగనుందని తెలుస్తోంది. ఇకపోతే ఇలా చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విడుదల రోజు ఉదయానికి పాజిటివ్ మౌత్ టాక్ రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. కాబట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ అలాగే పబ్లిక్ హాలిడేస్ అయినా తర్వాత రెండు రోజులు సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..
నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు . జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదల అవ్వగా ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యావ్యవస్థ పై ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది కాన్సెప్ట్ గా సినిమాను తెరకెక్కించారు. మొత్తానికైతే ఈ కాన్సెప్టు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మరి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.