తెలుగు వెండి తెరపై ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే ఎవర్గ్రీన్ లవ్ స్టోరీస్ లో 'మనసంతా నువ్వే' సినిమా కూడా ఒకటి. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఈ సినిమా 2001వ సంవత్సరంలో విడుదలై యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్నతనంలో స్నేహం ఆ తర్వాత ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇక ఎప్పటిలాగే ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. అలాగే హీరోయిన్ గా చేసిన రీమాసేన్ పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కంటే ముందు రీమాసేన్ కేవలం గ్లామర్ పాత్రలోనే నటించింది. 


కానీ ఈ సినిమాతో తనలోని నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ సినిమా కంటే ముందు ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించినా.. మనసంతా నువ్వే సినిమా ఆమెకు కెరీర్ పరంగా మంచి బూస్ట్ ను అందించింది. 2001లో చిత్రం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది రీమాసేన్. ఆ తర్వాత నాగార్జునతో కలిసి భావన వచ్చాడు, బాలయ్య తో కలిసి సీమ సింహం, తరుణ్ తో కలిసి అదృష్టం, రవితేజతో వీడే, పవన్ కళ్యాణ్ తో బంగారం లాంటి పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్నేళ్ల  గ్యాప్ తీసుకుని యమగోల మళ్ళీ మొదలైంది, యుగానికి ఒక్కడు, ముగ్గురు వంటి సినిమాలు చేసింది.


కాగా సినిమాల్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2012లో బిజినెస్ మ్యాన్ అయిన శివ కిరణ్ సింగ్ ను పెళ్లాడింది. ఇక ఈ దంపతులకు రుద్రవీర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ హీరోయిన్. చివరిసారిగా ఆమె 2012లో గ్యాంగ్ ఆఫ్ వస్సే పూర్ అనే హిందీ సినిమాల్ఓ నటించింది. ఇక నటనకు గుడ్ బాయ్ చెప్పి.. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబంతోనే గడుపుతుంది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అప్పటికి ఇప్పటికీ రీమాసేన్ అందంలో ఏమాత్రం తేడా లేదనే చెప్పాలి. తాజాగా ఈమె ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా. ఆ ఫోటోల్ల్లో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: