మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా తండ్రికి తగ్గ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తండ్రి లెగసిని కంటిన్యూ చేస్తారు. ఇక అలాంటివారిలో రామ్ చరణ్ కూడా ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.

రామ్ చరణ్ కెరియర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాడు. రామ్ చరణ్ తన భార్య ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది .అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలు ఉపాసన గతంలో వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వ్యవహారంతో ప్రేమ అంటేనే చిరంజీవి చాలా కోపడేవారు. దాంతో తన ప్రేమ గురించి తండ్రికి ఎలా చెప్పాలో సతమతమయ్యాడట చరణ్. ఇక ఆ సమయంలోనే చిరంజీవిని ఓపెన్ చేయగల ఏకైక వ్యక్తి తన అమ్మ సురేఖ అని గ్రహించాడు రామ్ చరణ్.

వెంటనే ఉపాసన ప్రేమ విషయాన్ని తన తల్లికి ఏమాత్రం సందేహపడకుండా మొత్తం చెప్పేసాడు. అనంతరం రామ్ చరణ్ తల్లి ఉపాసన గురించి అన్ని విషయాలను చిరంజీవికి చెప్పి ఒప్పించింది. ఉపాసనలో ఎలాంటి లోపాలు లేకపోవడం మంచి సాంప్రదాయబద్ధమైన ఇంటి అమ్మాయి కావడంతో చిరంజీవి కూడా తమ ప్రేమని కాదనలేకపోయాడు. వాటితో పాటు తన స్థాయికి తగ్గ కుటుంబం కావడంతో చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాడు చిరంజీవి. అందుకే ఉపాసన మరియు రామ్ చరణ్ తల్లి సురేఖ ఎప్పుడు కలిసి ఉంటారు. చెప్పాలంటే చిరంజీవితో కంటే ఉపాసన ఎక్కువ క్లోజ్ గా సురేఖ తోనే కనిపిస్తూ ఉంటుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: