డార్లింగ్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి.. అన్ని కూడా వందల కోట్ల బడ్జెట్ లతో మేకర్స్ నిర్మిస్తున్నారట...

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న ప్రభాస్సినిమా మొదలు పెట్టిన కూడా సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది.. ప్రస్తుతం మన ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ సినిమాలు ఉన్నాయి..

అందులో వరల్డ్ లెవల్లో చేస్తున్న సినిమానే ''ప్రాజెక్ట్ కే''.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తుంది ఈ సినిమా.. ఈ సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతుందని సమాచారం.. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె మరియు అమితాబ్ బచ్చన్ వంటి భారీ స్టార్స్ ఇందులో భాగం అయ్యారు.

సినిమా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే నాగ్ అశ్విన్ ఏమాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు సైతం అర్ధం కానీ పోస్టర్ ను విడుదల చేసాడు.. ఆ తర్వాత ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఇటీవలే ప్రకటించి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు.. మహా శివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ కే విడుదల తేదీ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న 2024లో విడుదల చేయనున్నట్టు డేట్ కూడా లాక్ చేసారు. ఇదిలా ఉండగా దీనికి సంబందించిన సాలిడ్ అప్డేట్ తాజాగా తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం పూర్తి కాగా మరో పక్క గ్రాఫిక్స్ కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే షూట్ చేసిన అవుట్ ఫుట్ కి సిజి వర్క్ కోసం 5 కంపెనీలు వర్క్ చేస్తున్నాయని తెలుస్తుంది.. ఈ సినిమాలో విజువల్స్ తో పాటుగా సాలిడ్ ఎమోషన్స్ కూడా అద్భుతంగా వుంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: