నందమూరి తారకరత్న గుండెపోటు వచ్చి దాదాపు 23 రోజులపాటు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతువుతో పోరాడి జనవరి 18వ తేదీన తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మార్చి రెండవ తేదీన ఆయన కుటుంబ సభ్యులు తారకరత్నకు పెద్దకర్మ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నారా, నందమూరి ఫ్యామిలీలతో పాటు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు కూడా వచ్చి తారకరత్న చిత్ర పటం ముందు పువ్వులను సమర్పించారు.ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్త తనకు రాసిన లవ్ లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది..
39 ఏళ్ల వయసు అంటే చాలా చాలా  చిన్నది.. చూడాల్సిన జీవితం మరెంతో ఉంది.  అసలైన బాధ్యతలు మునుముందే రాబోతున్నాయి.. రాబోయే రోజుల్లోనే కుటుంబానికి పెద్ద దిక్కు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డలకు తండ్రి అవసరం కూడా అప్పుడే మొదలవుతుంది.. కానీ దురదృష్టం కొద్ది తారకరత్న ఇవేవీ చూడకుండానే ఏవి అనుభవించకుండానే భార్యాబిడ్డలను వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోయారు. మరీ ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.. తారకరత్న అంతిమ సంస్కారాలు.. చిన్న కర్మ , పెద్దకర్మలో కూడా అలేఖ్య రెడ్డిని చూసిన వారి గుండె బరువెక్కక మానదు.

ఇకపోతే ఇటీవల అలేఖ్య రెడ్డి తన భర్తను గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  అది చూసిన వారందరూ కూడా తారకరత్న అలేఖ్యరెడ్డి మధ్య బంధం ఎంతటితో అర్థం చేసుకుంటున్నారు.  ముఖ్యంగా ఆయన తన భార్యను ఎంతలా ప్రేమించారో మనకు ఆ లెటర్ ద్వారా తెలుస్తోంది. గతంలో వాలెంటైన్స్ డే సందర్భంగా తారకరత్న తన భార్య అలేఖ్య రెడ్డికి రాసిన లేక చదువుతుంటేనే వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ఇకపోతే తన భార్యను తారకరత్న బంగారు తల్లి అంటూ సంబోధించి ఆమెపై తనకున్న అనురాగాన్ని చాటుకున్నారు ప్రస్తుతం ఈ లెటర్ చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: