టాలీవుడ్ సినిమాలతో పరిచయమైన అందాల తార కేతిక శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పురి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈమె. మొదటి సినిమాతోనే తన అందంతో ఎందరు ఆకట్టుకున్న ఈమె గ్లామర్కి అందరూ ఫిదా అవ్వాల్సిందే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఒక సినిమాతో విపరీతమైన క్రేజ్ దగ్గించుకుంది కేతిక శర్మ. వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతోంది ఈమె. ఈ సినిమా అనంతరం హీరో నాగ శౌర్య నటించిన లక్ష అనే సినిమాలో నటించింది కేతిక.

 ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. దాని అనంతరం మెగా హీరో వైష్ణవి హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ ఎంటర్టైనర్ సినిమా వచ్చిన రంగ రంగా వైభవంగా సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించిన ఈమె.భారీ అంచనాల మధ్య వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది .ఊహించిన స్థాయిలో ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోలేకపోయింది .ఈ క్రమం లోనే ప్రస్తుతం ఈమె ఒక బంపర్ ఆఫర్ను అందుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి .

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో ఈమె ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తమిళం మూవీ అయిన వినోదయ సీతం సినిమా రీమిక్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోకి తో పాటు మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటిస్తోందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో దీపిక దశ తిరుగుతుందని ఎన్నో ఆశలతో ఉంది కేతిక. ఇక ఈ సినిమాలోమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జోడిగా ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుందట కేతిక .ఈ సినిమాతో అయినా కేతగా మళ్లీ కెరియర్లో సక్సెస్ బాట పడుతుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: