నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది 'బింబిసారా' సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ దీని అనంతరం రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. కెరీర్ లో మొదటిసారి ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు కళ్యాణ్ రామ్. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. డోపల్ గ్యాంగర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కొంతమంది ఆడియన్స్ కి నచ్చగా.. 

మరి కొంతమంది కథలో స్ట్రాంగ్ పాయింట్స్ లేవని సినిమా పై అసహనం వ్యక్తం చేశారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమైంది. నిజానికి అగ్ర హీరోల సినిమాలన్నీ థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటిటిలోకి వస్తాయి. కానీ కళ్యాణ్ రామ్ అమిగోస్ మాత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 10 తేదీన నెట్ ఫ్లిక్స్ లో అమిగోస్ మూవీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాగా నెట్ ఫిక్స్ నుండి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా ఆషీక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా మిశ్రమ స్పందనను రాబట్టినా.. సినిమాలో ఈ హీరోయిన్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె డాన్స్, ఎక్స్ప్రెషన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మరి థియేటర్లో మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకున్న అమిగోస్ ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ని అందుకుంటుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 'డెవిల్' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న డెవిల్ మూవీ ని ఇదే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: