టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో రూపొందిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి మూవీ లోనే తన అందమైన నటన తో అంతకు మించిన అంద చందాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస సినిమా అవకాశాలను దక్కించుకొని ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో సమంత నటనకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత ... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం అనే మూవీ లో నటిస్తోంది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది. వీటితో పాటు రాజ్ అండ్ డీ కే కలిసి రూపొందిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన సమంత కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ మూవీ లో ఒక ఐటమ్ సాంగ్ లో నటించి తన అంద చందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమంత తాజాగా తన ఇన్ స్టా లో 25 మిలియన్ ఫాలోవర్స్ మార్కును చేరుకుంది. దీనితో సమంత ఒక ఫోటోను షేర్ చేస్తు తనపై ఎంత ప్రేమను చూపిస్తున్న ఫాలోవర్స్ లు థాంక్స్ అంటూ ఇన్ స్టా లో స్టేటస్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: