టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం సెబాస్టియన్ ... సమతమే ... నేను మీకు బాగా కావాల్సిన వాటిని అనే మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు మూవీ లలో సమ్మతమే మూవీ కాస్త పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే కిరణ్ "వినరో భాగ్యము విష్ణు కథ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా ఈ సంవత్సరం ప్రారంభం లోనే మంచి విజయం అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం మీటర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని కూడా తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి మీటర్ మూవీ తో ఈ యువ హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఏప్రిల్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: