హీరో హీరోయిన్లకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు అది తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఫలానా హీరో ఒక ప్రముఖ వ్యాపారవేతకు బంధువు అవుతాడు లేదా ఫలానా హీరోయిన్.. మరో హీరోకి  వరుస అవుతుంది అంటూ ఎన్నో వార్తలు అప్పుడప్పుడు ఇక ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ లయ గురించి కూడా ఇలాంటి వార్త ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.


 కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి వారిలో లయ కూడా ఒకరు అని చెప్పాలి. స్వయంవరం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత దాదాపు 30 కి పైగా సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటించిన సినిమాల్లో చాలానే హిట్ సినిమాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతుంది అనుకున్నప్పటికీ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయింది.



 ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనను అందరూ కూడా కోటీశ్వరురాలిని అని అనుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే అవును నేను అంబానీ చెల్లెల్ని అంటూ సరదాగా నవ్వుతూ చెప్పేసింది లయ. అయితే లయ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటలను కొంతమంది మాత్రం సీరియస్గా తీసుకున్నారు. నిజంగానే లయ అంబానీ చెల్లెలు అయి ఉండొచ్చు అంటూ ఇక సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: