
ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంద్రవాల సినిమా అని కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ నెలలోనే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు సైతం కాస్త ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ ,యమదొంగ, టెంపర్ వంటి సినిమాలు వదిలేసి ఇలాంటి ఫ్లాప్ సినిమాలను ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ కలెక్షన్లు రాకపోతే ట్విట్టర్లో జరిగే ట్రోలింగ్ కి ఎవరు సమాధానం చెబుతారు అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
2004లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆడియో లాంచ్ ఈవెంట్ కి లక్షలాది మంది అభిమానులు స్పెషల్ ట్రైన్లు వేసి మరి తీసుకువెళ్లడం ఒక చరిత్రగా మిగిలిపోయింది.మళ్లీ అలాంటిది ఏ హీరోకు జరగలేదు. విపరీతమైన హైపో వచ్చిన ఆంద్రవాల సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో పూరి జగన్నాథ్ తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్ తగిలింది.రొటీన్ స్టోరీ అతిగా అనిపించే కామెడీ ట్రాక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎవరిని ఏ కోణంలో కూడా మెప్పించలేకపోయింది. కేవలం చక్రి మ్యూజిక్ డాన్సులు మాత్రమే ఇందులో కాస్త పర్వాలేదు అనిపించాయి.