పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు రాజకీయాలకు పరిమితమై సినిమాలకు దూరమయ్యాడు.  ఇక ఇప్పుడు మాత్రం సినిమాలను రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక వైపు రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తూనే మరోవైపు  ఇక సినిమాల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరస సినిమాలు షూటింగులతో పవన్ బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మరికొన్ని సినిమాలను కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు వరుణ్ తేజ్ తో ఒక సినిమాకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్.


 తమిళ హిట్ మూవీ అయినా వినోదాయ సీతం సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కీలకపాత్రలో నటిస్తుంటే ఇక మెగా ముద్దుల అల్లుడు సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్ లో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్రఖిని  దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్లుగా డైలాగులు స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న  లీక్ బయటికి వచ్చినా కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.



 అయితే ఇలా వినోదాయ సీతం అనే సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకేక్కుతున్న సినిమాలో పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే ఆల్ టైం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. భీమ్లా నాయక్ సినిమా కోసం రోజుకి రెండు కోట్లు ఛార్జ్ చేశాడట పవన్ కళ్యాణ్. అయితే ఇక ఇప్పుడు ఈ తమిళ రీమేక్ కోసం ఏకంగా 3.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఇక నిర్మాణ సంస్థ సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పవన్ అడిగినంత ఇచ్చేస్తుందట. ఇక పవన్ సినిమా షూటింగ్ కోసం ఇచ్చిన డేట్స్ చూసుకుంటే మొత్తంగా 75 కోట్ల రెమ్యూనరేషన్ ఈ సినిమా కోసం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: