దసరా : టాప్ హీరోల సినిమాలకి ధీటుగా అక్కడ రిలీజ్ ?

టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇక కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపించనుంది.ఊర మాస్ ఎలిమెంట్స్ తో దసరా సినిమా భారీ అంచనాలని నెలకొల్పింది. టీజర్ ఇంకా పాటలు నేషనల్ సెన్సేషన్ గా నిలిచి, అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతగానో అలరించి టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.తాజాగా మేకర్స్ దసరా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మార్చి 14 వ తేదీన దసరా ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అయితే సూపర్ గా వుంది. రావణ దహనం జరుగుతుండగా నాని గొడ్డలి పట్టుకొని ఎదురుగా నిలుచున్న పవర్ ఫుల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.


దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ ఇంకా అలాగే జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాని అమెరికాలో రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 600 కి పైగా లొకేషన్స్ లో ఈ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మంచి బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఖచ్చితంగా నాని కూడా టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: