నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.

మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను లక్నో నుండి విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నాని మరియు కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరి నటన ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ  స్నేహం, ప్రేమ, ఎమోషనల్ అంశాలు హైలైట్ గా సాగుతుందని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ ని సింగరేణి బొగ్గు కానుగుల కార్మికుల నేపథ్యంలో రా అండ్ రాస్టిక్ గా నిర్మించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలలో నాని మరియు ఇతర చిత్ర బృందం కూడా రా అండ్ రాస్టిక్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: