
ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఎన్నో ఏళ్ల నుండి కలలు కంటున్న ఇండియన్ సినిమాకు ఆస్కారు అవార్డును రాచ మర్యాదలతో పట్టం కట్టి మరీ ఆ కలను సాకారం చేసింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ కేటగిరి సాంగ్ లో ఉత్తమ పాటగా నిలిచి తెలుగు వారి కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఒక్క రాత్రిలో జరిగిన అద్భుతం కాదు దీని వెనుక ఎన్నో లెక్కలు ఉన్నాయి. ఈ పాట వెనుక ఉన్న జక్కన్న శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చిత్రీకరణ విషయంలో ప్రతీ సీను తాను అనుకున్న విధంగా డిజైన్ చేసుకున్న విధంగా 100 పర్సంట్ వచ్చేవరకు ఏమాత్రం కాంప్రమైజ్ కాడు అన్న విషయం తెలిసిందే.
ఇక ఈ అవార్డు రావడం వెనుక రాజమౌళి సతీమణి రమా రాజమౌళి మొదటి భర్త కొడుకు కార్తికేయ కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్, రిలీజ్ కు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే వాడట. ముఖ్యంగా ఈ ఆస్కార్ నామినేషన్ కు పంపడం కోసం ఈయన చేసిన శ్రమ అపారమైనది అని తెలుస్తోంది. తెరవెనుక ఉండి అన్నీ తానై అవార్డు రావడంలో ప్రధాన పాత్ర పోషించాడు కార్తికేయ. కానీ ఈయన గురించి ఎవ్వరికీ తెలియకపోవడంతో కొందరు బాధపడుతున్నారు. గుడ్ వర్క్ కార్తికేయ ..!