
ఈనెల మొదటి నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో ఎక్కువగా ఆదరణ పొందిన సెలబ్రెటీగా ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు ఆ తర్వాత ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ ,పవన్ కళ్యాణ్ ఉండడం విశేషములు చెప్పవచ్చు. ఈ నెలలో ఎక్కువమంది సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోగా ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలవడంతో ఆయన అభిమానులు కూడా చాలా సంబరపడుతున్నారు తాజాగా ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా సోషల్ మీడియాలో ట్రెండిగా నిలిచారు.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్స్ లో మొదటి స్థానాలలో వీరున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.ఇప్పుడు నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా రావడంతో వీరికి మరింత పాపులారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు ఎన్టీఆర్ సెలబ్రేషన్స్ ముగించుకొని త్వరలోనే కొరటాల శివకా దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. అలాగే కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నది మొదటిసారిగా ఎన్టీఆర్ తోనే ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.