నట సింహం నందమూరి బాలకృష్ణ మరోసారి ఆహాలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ అనే షో తో బాలయ్య ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లతో మెప్పించిన బాలయ్య ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అంతేకాదు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 2 కంటెస్టెంట్ ని సైతం బాలయ్యే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. గత సీజన్లో కూడా బాలయ్య పాల్గొనడంతో ఆ ఎపిసోడ్కి భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకే ఈ సీజన్లో కూడా బాలయ్యను భాగస్వామ్యం చేయాలని ఆహా టీం ప్లాన్ చేసింది. 

అందుకే బాలయ్యకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆయన్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం గెస్ట్ గా వస్తున్న బాలయ్యకు ఏకంగా 25 లక్షల రెమ్యూనరేషన్ను ఇచ్చారట ఆహా నిర్వాహకులు. కేవలం ఒక్క ఎపిసోడ్ కోసం బాలయ్య పాతిక లక్షల రూపాయలను తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయమై ఆహా టీం నుండి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గెస్ట్ గా ఒక్క ఎపిసోడ్ కి బాలయ్య ఈ రేంజ్ లో చార్జ్ చేయడంతో ఓటిటి షోల్లో బాలయ్య క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న  బాలయ్య..

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'NBK 108' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్యకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. అలాగే బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా హీరోయిన్ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే హీరోయిన్ శ్రీల ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: