టాప్ హీరోయిన్ సమంత పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ పోరాటానికి తనకు శక్తిని ప్రసాదించమంటూ సమంత ఒక శక్తిని ఆరాదిస్తోంది. సమంత తన పుట్టుక రీత్యా క్రైస్తవ మతం నమ్మకాలలో పెరిగింది. అయితే ఆతరువాత ఆమె టాప్ హీరోయిన్ గా మారిపోవడంతో రకరకాల మతాలకు సంబంధించిన సాంప్రదాయాలు ఆమెకు పరిచయం అయ్యాయి.


సమంత ఆమధ్య కేదార్నాథ్ వెళ్ళి అక్కడ ప్రకృతిని చూసి పరవసించిపోయి చాలాసేపు ధ్యానంలో ఉండిపోయింది. ఈమధ్య ఆమెకు ఆరోగ్య సమస్యలు మరన్ని పెరిగిపోవడంతో తిరిగి తన మనోధైర్యాన్ని పెంచుకోవడానికి మళ్ళీ ధ్యానం చేస్తోంది. ఒక ఫోటో ముందు ఆమె ధ్యానం చేస్తూ తన శక్తిని పెంపొందించుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చాల పట్టుదలతో చేస్తోంది.


‘ఊహించని పరిణామాలు. కారణం ఏదైనా దేవునిపై విశ్వాసం ఉంచితే అది ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తుందని నా నమ్మకం’ అంటూ ఆమె తన కామెంట్స్ పెట్టింది. అంతేకాదు ‘విశ్వాసం మనలను ముందుకు తీసుకువెళ్ళి మనలను ప్రశాంతంగా ఉంచుతుంది’ అంటూ మరో కామెంట్ పెట్టింది. ఈమధ్య ఆమె నటిస్తున్న ఒక హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఆమెకు చేతికి గాయాలు అయిన విషయం తెలిసిందే. ఆ గాయపడిన తన చేతి వెళ్ళ ఫోటోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.


వాస్తవానికి సమంతకు వస్తున్న కష్టాలను చూసి చాలామందికి జాలిగా అనిపిస్తున్నప్పటికీ తరుచు ఆమె అనారోగ్య సమస్యలతో చేస్తున్న పోరాటానికి సంబంధించి ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు ఒక విధంగా ఆమె పై జాలిని కలిగించినప్పటికీ ఆమెకు వచ్చే అవకాశాలు పరోక్షంగా దెబ్బ తీసే అవకాశం ఉంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈవిషయం పై సమంత వ్యూహాత్మకంగా ఆలోచనలు చేస్తే బాగుంటుందని మరికొందరి అభిప్రాయం. త్వరలో విడుదల కాబోతున్న ‘శాకుంతలం’ మూవీ హిట్ కావడం ఆమె కెరియర్ కు అత్యంత ఆవశ్యకం. దీనితో ఈమూవీ ఫలితం ఎలా ఉండబోతోంది అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..
మరింత సమాచారం తెలుసుకోండి: