ఏదైనా స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతుందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తుందేమో అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే బయటికి వచ్చే లీకులు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ అటు చిత్ర బృందానికి మాత్రం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇలాంటి లీకుల తలనొప్పి ప్రతి సినిమాకు తప్పడం లేదు.


 దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా చిన్న చిన్న లీక్స్ బయటికి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా ఇలాంటి లీకుల బెడద తప్పడం లేదు అన్నది తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. కోలీవుడ్ హిట్ మూవీ వినోదాయ సీతం సినిమాకు ఇక తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెలకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తూ ఉండడం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జి స్టూడియోస్ బ్యానర్ పై ఇక ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు దేవుడున్నాడు అనే టైటిల్ అనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అయితే రాజకీయాల్లో బిజీ అయ్యి సినిమాలను పక్కన పెట్టే ముందే ఇక సినిమాను ముగించేయాలని దర్శకుడు మాత్రం భావిస్తున్నాడట. ఈ సినిమాకు సముద్రఖినికి దర్శకత్వం వహిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఇలా షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తున్న ఎంతోమంది ప్రేక్షకులు అక్కడ తమ మొబైల్స్ కి పని చెబుతున్నారు. ఇక ఇటీవల పవన్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఫోటోలో పవన్ వెనుక తేజ్ నిలబడి ఉన్నాడు. పవన్ ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించగా.. అతని వెనుకున్న సాయి ధరమ్ తేజ్ డాక్టర్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: