‘దసరా’ కథ ‘పుష్ప’ మూవీ ఛాయలతో ఉంటుంది అని జరుగుతున్న ప్రచారం పై స్పందిస్తూ తన హెయిర్ స్టైల్ మాసిన లుంగీ బనియన్ తప్పించి మరే విషయంలోను తన మూవీలో ‘పుష్ప’ ఛాయలు కనిపించవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనితో ఈవిషయమై క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలామంది ‘దసరా’ మూవీ కథలో ఎక్కడో అక్కడ ‘పుష్ప’ షేడ్స్ కనిపిస్తాయి అన్న ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈనెలాఖరున విడుదల కాబోతున్న ‘దసరా’ మూవీతో టాలీవుడ్ లో సమ్మర్ రేస్ మొదలు కాబోతోంది. ఇప్పటివరకు గత రెండు నెలలుగా చిన్న సినిమాలు చూసి విసిగిపోయిన సగటు ప్రేక్షకులకు మాస్ ఆనందాన్ని ఇవ్వడానికి ‘దసరా’ రెడీ అవుతోంది. సంక్రాంతి సినిమాలు తరువాత విడుదల కాబోతున్న భారీ సినిమా కావడంతో ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. దీనితో నాని కెరియర్ లో ఈమూవీ అత్యధిక కలక్షన్స్ కలెక్ట్ చేసి అతడి 100 కోట్ల కలను నిజం చేస్తుంది అన్న అంచనాలు కూడ ఉన్నాయి.
ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ మూవీ ఫలితం పై ఉన్న మితిమీరిన నమ్మకంతో ఈమూవీ విడుదల అయినతరువాత మాత్రమే తాను మరో కొత్త సినిమాకు సంతకం పెడతాను అని చెపుతోంది అంటే మూవీ పై ఉన్న భారీ అంచనాలు తెలియచేస్తున్నాయి. అయితే ఇలాంటి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలకు కథ ఏమాత్రం రొటీన్ గా అనిపించినా ప్రేక్షకుల నుండి వెంటనే డివైడ్ టాక్ వస్తుంది. దీనితో ‘దసరా’ ఫలితం పై అందరిలోను బాగా ఆశక్తి పెరుగుతోంది..