ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆ తర్వాత ఎన్నో మూవీ లలో హీరో గా నటించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వక్ ఆఖరుగా అశ్విత్ మరిమత్తు దర్శకత్వంలో రూపొందిన ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు.మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దాస్ కా దమ్కి అనే మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా శిల్పకళా వేదిక ... హైదరాబాద్ లో మార్చ్ 17 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ... ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: