ఈ ఏడాది ఆరంభంలోని వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హీట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'భోళాశంకర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వేదాళంకి ఇది తెలుగు రీమేక్. ప్రస్తుతం చిత్రీకరణ శరీరకంగా జరుపుకుంటున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని చిత్రవర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ అందుకోవడంతో బోలాశంకర్ సక్సెస్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇక సినిమాలో మెగాస్టార్ తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో హీరోగా తనదైన నటనతో ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు సుశాంత్. అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషించగా.. ఆ పాత్రలో మంచి నటన కనబరిచాడు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలోనూ సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడుమ్ ఈ సినిమాలో రవితేజ తో పాటు సుశాంత్ రోల్ కూడా చాలా కీలకంగా ఉండబోతుందని మూవీ యూనిట్ చెబుతోంది.

ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో సుశాంత్ కు ఓ మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే కదా. ఇక కీర్తి సురేష్ ప్రియుడి పాత్రలో సుశాంత్ కనిపించబోతున్నాడట. ఇక తమిళంలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ తెలుగులో సుశాంత్ కోసం పాత్ర నిడివిని దర్శకుడు మెహర్ రమేష్ పెంచినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 18న సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా కథానాయకగా నటిస్తుండగా.. తమన్ సంగీతమందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: