తమిళ సినీ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా రూపొందింది. తమిళ్ లో ఈ సినిమా వేత్తి అనే పేరుతో విడుదల అయింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను సాధించిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా మార్చి 17 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది.

ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ కి "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. మీలో ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ సినిమా ప్రస్తుతం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: