ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. అనసూయ , సునీల్ , రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా ... సమంతమూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప ది రైజ్ మూవీ మంచి విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఆ యాక్షన్ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యూనిట్ చెన్నైలో మ్యూజిక్ సెట్టింగ్ లలో పాల్గొన్న బోతునట్లు తెలుస్తుంది. ఈ మ్యూజిక్ సెట్టింగ్ లలో దేవి శ్రీ ప్రసాద్ తో పాటు సుకుమార్ ... అల్లు అర్జున్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని పార్ట్ 2 కంటే మించిన స్థాయిలో భారీ ఖర్చుతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: