మూవీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. 2005 వ సంవత్సరంలో ఓ చిన్న మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళ్, మలయాళం ఇంకా అలాగే కన్నడ చిత్రాల్లో నటించి తన అందాలతో ఎంతగానో మెప్పించింది.2010 వ సంవత్సరంలో కల్యాణ్‌ రామ్‌ కత్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సనాఖాన్‌.ఇక ఆ తర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్‌ జయహో ఇంకా అక్షయ్‌ కుమార్‌ టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా సినిమాల్లో కూడా సనా కనువిందు చేసింది. అంతకుముందు హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచి బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యింది. ఇక మొత్తం మీద 14 సినిమాలు, 50కు పైగా యాడ్లలో నటించిన ఈ బ్యూటీ కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే మూవీలకు గుడ్‌ బై చెప్పేసింది.2019వ సంవత్సరంలో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరిగా కనిపించిన ఆమె మరుసటి ఏడాదే మూవీల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది.


ఆ తర్వాత ముఫ్తీ అనస్ సయ్యద్ ను పెళ్లి చేసుకుని దుబాయ్‌ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది.అయితే సినిమాల నుంచి చాలా దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది సనాఖాన్‌. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ ఆమె షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తన అభిమానులకి ఓ శుభవార్త చెప్పిందీ ముద్దుగుమ్మ. త్వరలోనే తాను తల్లిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ సంవత్సరం హాజ్ తీర్థ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సనాఖాన్ అప్పుడే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది.మళ్ళీ తాజాగా మరోసారి ఈ విషయంపై నోరు విప్పారు సనాఖాన్‌ దంపతులు. తమ మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. తాను గర్భం దాల్చానని, జూన్ నెల చివరిలో తన డెలివరీ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఇది తనకి చాలా అందమైన ప్రయాణం అనుకుంటున్నానని, తన బిడ్డను తన చేతులతో ఎత్తుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం సనాఖాన్‌ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు అలాగే నెటిజన్లు సనాఖాన్‌ దంపతులకు అభినందనలు ఇంకా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: