మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ పేరుకు బాబాయ్ ... అబ్బాయిలు అయినప్పటికీ స్నేహితుల కలిసి ఉంటారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎన్నో బహిరంగ సభల్లో కూడా వీరిద్దరూ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీని చాలా చురుగ్గా ముందుకు తీసుకు వెళుతున్న విషయం కూడా మనకు తెలిసిందే.  

ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం కేవలం సినిమాల పైన దృష్టి పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ గా తన క్రేజీ ను పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తన బాబాయ్ సొంత పార్టీ అయినటు వంటి జనసేన కు సహాయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా ... అసలు విషయం లోకి వెళితే ... రామ్ చరణ్ కొంత కాలం క్రితం ఆరెంజ్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని కొణిదెల నాగబాబు నిర్మించాడు.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. కాకపోతే ఈ మూవీ కి ఆ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా వచ్చే కలెక్షన్ లని రామ్ చరణ్ "జనసేన" పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా జనసేన పార్టీ కోసం రామ్ చరణ్ సహాయం చేయనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: