అల్లు ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత,విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానికి కారణం అల్లు ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమే.. తాజాగా అల్లు శిరీష్ తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఒక షాకింగ్ పోస్ట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అల్లు శిరీష్ పెట్టిన పోస్టుతో చాలామంది ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదేంటి అల్లు శిరీష్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. కనీసం ప్రేమలో ఉన్న విషయం కూడా ఇప్పటివరకు ఎక్కడ బయట పెట్టకుండా ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఏంటి అని అందరూ షాక్ అయ్యారు.అల్లు రామలింగయ్య బర్త్ యానివర్సరీ సందర్భంగా తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. 

అయితే అంతా బాగానే ఉంది. చాలామంది అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలియడంతో ఆయనకు విష్ చేస్తున్నారు. కానీ కొంతమంది విష్ చేయాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం అల్లు ఫ్యామిలీ చేసిన తప్పే. అదేంటంటే రీసెంట్ గానే అల్లు శిరీష్ నాయనమ్మ అల్లు కనక రత్నమ్మ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రకారం ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆడపిల్లల పెళ్లిళ్లు, ఆడపిల్లలకు సంబంధించిన శుభకార్యాలు తప్పితే మగవాళ్లకు సంబంధించిన ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు.
అలాంటిది ఏకంగా నాయనమ్మ చనిపోయిన నెలరోజులకే ఎంగేజ్మెంట్ చేసుకున్నానని అల్లు శిరీష్ చెప్పడంతో నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన నెలకే ఎవరైనా ఎంగేజ్మెంట్ చేసుకుంటారా.. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లకు సంబంధించిన శుభకార్యాలు తప్ప మగవాళ్ళ శుభకార్యాలు చేయరు. కనీసం సంవత్సరం లేదా ఆరు నెలలైనా వెయిట్ చేస్తారు.కానీ చనిపోయి నెల దాటిన వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇది హిందూ సాంప్రదాయానికి విరుద్ధం అంటూ చాలామంది మండిపడుతున్నారు.అలా అల్లు శిరీష్ కి శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇక అల్లు శిరీష్ నయనికల ఎంగేజ్మెంట్ ప్యారిస్ లో అక్టోబర్ 31న జరిగినట్టు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: