విద్య లేని వారు వింత పశువు అనే సామెత ఊరికే రాలేదు. మనిషికి విద్య అనేది ఉంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బ్రతికే శక్తి ఉంటుంది. ఇలాంటి విద్య మన ఇండియాలో చాలా ఖరీదు అయిపోయింది. అదే ఇతర దేశాల్లో అయితే విద్య, వైద్యం ఫ్రీగా దొరుకుతుంది. కానీ మనదేశంలో విద్య, వైద్యం అనేది చాలా ఖరీదు అయినది. అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే మిగిలిపోతుంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తీసేయడానికి వీల్లేదు అలాగని ప్రభుత్వ విద్యాసంస్థలను బలపరచలేరు. ఇలా ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు రెండు కళ్ళ ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యను అణచివేస్తూ వస్తున్నారు.. దీంతో కొంతమంది పేదలు చదువుకోవాలంటే విద్య అనేది అందకుండా పోతుంది.. 

ముఖ్యంగా చాలా వరకు ప్రైవేట్ సంస్థలన్నీ రాజకీయ నాయకులకే ఉన్నాయి. వారి సంస్థలు నడవాలంటే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం  చేయాలని వారు అనుకుంటున్నారు.. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలను పెద్దగా డెవలప్ చేయకుండా వస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.. రెండు తెలుగు, రాష్ట్రాలకు ఒక అద్భుతమైన ఆఫర్ అందించింది. మరి అదేంటో వివరాలు చూద్దాం.. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కువగా ప్రైవేట్ సంస్థలతో పోటీపడుతున్నటువంటి విద్యాసంస్థ కేంద్రీయ విద్యాలయాలు. ఇందులో చదివారంటే తప్పకుండా ఆ విద్యార్థి అద్భుతమైన ప్రతిభ సాధించగలుగుతారు. అయితే ఇప్పటివరకు కేంద్రీయ విద్యాలయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలకు అనుమతులు వచ్చాయి. 

ఇక ఇవే కాకుండా మోడీ వచ్చిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, పీజీ సీట్లు, హాస్పిటల్స్ పెంచుకుంటూ వస్తున్నారు. దీనివల్ల పేదలకు, మధ్యతరగతి వారికి టాలెంట్ ఉన్నవారికి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఆదరణ లభించి చదువుకోవడానికి దారి దొరుకుతుంది. ముఖ్యంగా విద్యార్థులు స్కూల్ దశ నుంచే సానా పట్టాలనే ఆలోచనతో కేంద్రీయ విద్యాలయాలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్యాలయాలను  ప్రవేశపెట్టారు. ముఖ్యంగా వనపర్తి, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు లోని మంగసముద్రం, పలాస, శ్రీకాకుళం, అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రెండు రాష్ట్రాలకు ఈ విశ్వవిద్యాలయాలు త్వరలో ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: