సాధారణంగా సినీ సెలబ్రిటీలు అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనిపించకుండా పోయినప్పటికీ ఇక అటు సోషల్ మీడియా ద్వారా మాత్రం అట అభిమానులు అందరికీ కూడా ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులతో ఎప్పుడూ తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ ని పంచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం  సోషల్ మీడియాలో మరోవైపు సినిమాల్లో కూడా ఎక్కడా కనిపించరు. అలాంటి వారు ఎప్పుడైనా కెమెరాకు చిక్కారు అంటే చాలు ఇక వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు సినిమాల్లో తమ అందం అభినయంతో అలరించిన వారు ఆ తర్వాత ఎన్నో ఏళ్లకి గుర్తుపట్టలేనంతగా మారిపోతే.. ఇక వారిని చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాగే ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫోటోలు కొని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది భువనేశ్వరి. అయితే అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండట్లేదు. 2003లో వచ్చిన తమిళ బాయ్స్ సినిమా ద్వారా గుర్తింపు దక్కించుకుంది. గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమశాస్త్రి, ఆంజనేయులు లాంటి సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించింది. ఏపీలోని చిత్తూరు జిల్లా ఆమేస్వస్థలం కావడం గమనార్హం.

 సీరియల్స్ లో నటించిన భువనేశ్వరి తర్వాత వెండితెరపై అడుగుపెట్టి వరుసగా అవకాశాలు అందుకుంది. బోల్డ్ సీన్స్ లో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులకు పిచ్చెక్కించేది. ఇక తర్వాత అవకాశాలు లేక కనుమరుగు  అయిపోయింది. అయితే అప్పటినుంచి ఇక ఎక్కడా కెమెరాకు చిక్కలేదు. అయితే ఇటీవలే  తిరుమల దర్శనానికి వచ్చింది భువనేశ్వరి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వారు కెమెరాలకు పని చెప్పారు. అయితే భువనేశ్వరి ఎంతో లావుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా ఆమె మారిపోయిన తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: