తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న హీరో లలో విష్ణు విశాల్ ఒకరు. ఈ హీరో కొంత కాలం క్రితం రాక్షసన్ అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ తో ఈ హీరో క్రేజ్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ గా పెరిగిపోయింది. ఇదే సినిమాను తెలుగు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే విష్ణు విశాల్ కొంత కాలం క్రితమే "ఎఫ్ ఐ ఆర్" అనే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో మట్టి కుస్తీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ని మాస్ మహారాజా రవితేజ నిర్మించాడు. ఈ మూవీ లో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ కొన్ని రోజుల క్రితం నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయింది. బుల్లి తెరపై ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ మూవీ బుల్లి తెరపై  5.54 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. ఒక డబ్బింగ్ మూవీ ఈ రేంజ్ "టి ఆర్ పి" ని తెచ్చుకోవడం గొప్ప విషయమే అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: