
ముఖ్యం గా మాస్ ఆడియన్స్ కి అయితే పూనకాలు తెప్పించింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి లాగా అద్భుతం గా సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు శ్రీకాంత్ ఓదెల. ఇక ఈ సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ జంటగా నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక నాలుగు రోజుల్లోనే 87 కోట్ల వసూళ్ల మార్కును క్రాస్ చేసింది ఈ సినిమా. ఇంకా భారీ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతుంది అని చెప్పాలి.
అయితే ఇటీవల కాలం లో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిందంటే ఇక ఆ సినిమా కోసం పని చేసిన వారందరికీ కూడా ఏదో ఒకటి విలువైన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఇప్పుడు దసరా సినిమా తో లాభాలు సంపాదించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి సైతం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 10 గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చేందుకు నిర్ణయించాడు దర్శకుడు అని చెప్పాలి.