ఈ సంవత్సరం మార్చి 31 వ తేదీన తమిళ భాషలో మంచి అంచనాలు నడుమ విడుదల అయిన మూవీ విడుదలై పార్ట్ 1. ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెట్రి మారన్ దర్శకత్వం వహించగా ... గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం తమిళ భాషలో విడుదల అయ్యి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి నిర్మాత లలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ తెలుగు భాషలో విడుదల చేయనున్నాడు. తెలుగు లో ఈ మూవీ ని విడుదల పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 15 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

 ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టు కునే విధంగా ఉండడం ... అలాగే ఈ ట్రైలర్ లో సూరి మరియు విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ లు తెలుగు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఇప్పటికే తమిళ భాషలో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: