పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ . ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం ఓజి సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే సుజిత్ షూటింగ్ లోకేషన్ ల కోసం తెగ వెతికేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ ఎవరు అనే విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.


నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు దర్శకనిర్మాతలు తెలియజేయడం జరిగింది.ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెలుబడడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రియాంక ఇద్దరు వచ్చేవారం ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో మొదటి షెడ్యూల్ జరగబోతున్నట్లు సమాచారం. నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలు నటించింది. ఈ రెండు సినిమాలలో తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఓకే సారి పవన్ కళ్యాణ్ నటించ బోతున్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది.


అయితే మలయాల  ముద్దుగుమ్మ అయినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడంతో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరొక సక్సెస్ పడినట్టే అంటూ అభిమానులు సైతం చేస్తున్నారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ మేరకు ఈ ఆమ్మడి కి కలిసి వస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: