ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ఎనిమిది సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఓటీటీల యుగంలో ఎనిమిది సెంటర్లలో 100 రోజులు ఆడటం అంటే రికార్డ్ అనే చెప్పాలి.

ఈ నెల 23వ తేదీన ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ జరగనుండ గా ఈవెంట్ జరిగే ప్రదేశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. హిందూపురం, చిలకలూరిపేట, ఆలూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. అయితే ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం గురించి రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని పోస్టర్ లో పేర్కొనడంతో ఈ కామెంట్ చిరంజీవి  గురించి సెటైర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాల్తేరు వీరయ్య మల్టీస్టారర్ కావడంతో బాలయ్య ఈ కామెంట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వీరసింహారెడ్డి 100 రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

బాలయ్యకు తెలియకుండా ఈ పోస్టర్ బయటకు వచ్చి ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైత్రీ నిర్మాతలు మాత్రం అధికారికంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేయలేదు. ఈ నెల 23వ తేదీన 100 డేస్ ఫంక్షన్ లో బాలయ్య ఏం మాట్లాడతారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో సినిమాపై అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని బోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: