అందాల ముద్దు గుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నచురల్ స్టార్ నాని హీరో గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందినటు వంటి గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రియాంక ... శర్వానంద్ హీరో గా రూపొందినటువంటి శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లోని తన అంద చందాలతో ... నటన తో ప్రియాంక మాత్రం అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో చాలా క్రేజీ సినిమా ఆఫర్ లు ఉన్నాయి. ప్రియాంక చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు ఏవో తెలుసు కుందాం.

ప్రియాంక ప్రస్తుతం ధనుష్ హీరో గా రూపొందుతున్న కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తోంది . ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో పాటు జయం రవి కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న మూవీ లో కూడా ప్రియాంక నటిస్తుంది. ఈ రెండు మూవీ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" మూవీ లో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభం కాగా ... ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఈ ముద్దు గుమ్మ కూడా పాల్గొంటుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: